తొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయని పవన్ పేర్కొన్నారు. జనసేన
భావజాలంతో పోటీలో నిలిచి, పార్టీ శ్రేణుల మద్దతు పొందిన వారు 18
శాతానికిపైగా ఓట్లు సాధించి గణనీయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు కైవసం
చేసుకున్నారని చెప్పారు. 1,000కి పైగా వార్డుల్లో విజయం సాధించామని పవన్
పేర్కొన్నారు. అలాగే తనకు అందించిన సమాచారం మేరకు విశ్లేషిస్తే.. 1,700
పైగా పంచాయతీల్లో రెండో స్థానం దక్కిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ
ఫలితాలను చూస్తుంటే, మార్పు మొదలైందని అర్థమైందని చెప్పారు. ఇది కచ్చితంగా
మార్పునకు సంకేతమని తేల్చి చెప్పారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయని.. అలాంటి
పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పోరాటం
చేశారని చెప్పారు. ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని పవన్ కల్యాణ్
పేర్కొన్నారు.
ప్రజల్లో మార్పు మొదలైంది జనసేనకు 18% ఓట్లు.. పవన్
• PowerReader News Paper
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతగానే ప్రభావశీలంగా పని చేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
కొనియాడారు. ఎన్నికల ఫలితాలు ఎంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. పంచాయతీ
ఎన్నికల్లో ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో మార్పు మొదలైనట్లు అర్థమవుతోందని
జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ ఎన్నికలపై పవన్
కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
