ఇండియన్‌ నేవీలో 1,159 పోస్టుల దరఖాస్తులు..

 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన INDIAN NAVY దేశంలోని వివిధ నేవల్‌ కమాండ్‌లలో 1,159 TRADES MYANMETE  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో 710 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https;//www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 22న ప్రారంభమవుతుంది. మార్చి 7 దరఖాస్తులకు చివరి తేదీ.

ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (INCET) ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా కమాండ్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.

మొత్తం ఖాళీలు:1159

  • హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్- విశాఖపట్నం: 710
  • హెడ్‌క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్- ముంబై: 324
  • హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్- కొచ్చి: 125
ముఖ్య వివరాలు:
  • అర్హత: 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
  • వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు చెల్లిస్తారు.
  • పరీక్ష ఫీజు: రూ.205/-
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 22, 2021.
  • దరఖాస్తులకు చివరి తేది: మార్చి 07, 2021.
  • వెబ్‌సైట్‌:https;//www.joinindiannavy.gov.in/