పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 100 జాబ్స్‌..

 

న్యూదిల్లీ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. హెచ్ఆర్ఎం విభాగం 100 security manager  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలు https;//www.pnbindia.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 100

  • అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉండాలి‌.
  • వ‌య‌సు: జ‌నవ‌రి 01, 2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు 3 ఏళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
  • జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.48170 - రూ.69810 వ‌ర‌కు ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్ https://www.pnbindia.in/ లో లాగిన్ అవ్వాలి.
  • అందులో దరఖాస్తు ఫామ్‌‌ను డౌన్‌లోడ్ చేసి కింద తెలిపిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తు ఫీజుకు సంబంధించిన ఓచ‌ర్‌కాపీతో క‌లిపి స్పీడ్‌/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.
  • ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: Chief Manager (Recruitment Section), HRM Division, Punjab National Bank, Corporate Office plot no 4, Sector 10, Dwarka , New Delhi - 110075.
  •  
  • ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500/-.
  • ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో భాగంగా ఒక వ్యాసం / లేఖ సంబంధించిన ప‌రీక్ష నిర్వహిస్తారు.
  • ప‌రీక్ష‌లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
  • వెబ్‌సైట్‌:https;//www.pnbindia.in/ 
  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జనవరి 27, 2021.
  • ద‌ర‌ఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి చివ‌రి తేది: ఫిబ్రవరి 13, 2021
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఫిబ్రవరి 15, 2021.