NHRP FORUM ఆధ్వర్యంలో ఒకటైన దంపతులు.


పవర్ రీడర్ న్యూస్: విశాఖపట్నం నందు గల ఎన్ హెచ్ ఆర్ పి ఫార్మ్ ఆఫీసు నందు ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ను విజయవంతంగా పరిష్కరించడం జరిగినది. వైవాహిక జీవితంలో తలెత్తిన ఒక తీవ్రమైన సమస్య తో ఇరువురి దంపతులు సంప్రదించడం జరిగింది. ఈ సమస్య నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీ పూజారి గారి ఆధ్వర్యంలో శ్రీ పంపాన సత్యనారాయణ లీగల్ అడ్వైజర్ గారి సమక్షంలో మరియు  సైకాలజిస్ట్ శ్రీ రాము బొడ్డేపల్లి గారి సమన్వయంతో రాష్ట్ర కన్వీనర్ శ్రీ ఏ.సత్యనారాయణ గారి సమక్షంలో లో పరిపూర్ణమైనటువంటి కౌన్సిలింగ్ తో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 వరకు జరిగిన సమిష్టి కృషితో దంపతులు మళ్ళి ఒకటై ఒక ప్రమాణ పత్రాన్ని NHRP FORUM ఆధ్వర్యంలో రాయించుకున్నారు. దాంపత్య జీవితంలో ఎదురైనటువంటి ఒక విపరీత ధోరణి నేటి సమాజంలో అలముకున్న పరిస్థితుల్లో ఫోరం సభ్యుల సమిష్టి కృషితో సమస్య కోర్టు పరిధిలో వరకు  పోకుండా దంపతులు మళ్ళీ ఒకటైనoదుకు సభ్యులందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం .ఒకటైన దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా NHRP ఫోరమ్వారికి తమ ధన్యవాదాలు తెలియజేశారు.