NYKS 13,206 పోస్టుల ద‌ర‌ఖాస్తులు..

  భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన (NYKS‌) 2021-2022 సంవ‌త్స‌రానికి 13,206 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పదోతరగతి పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https;//nyks.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 13,206

  • అర్హ‌త‌: క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త ఉండాలి‌.
  • వ‌య‌సు: 01.04.2021 నాటికి 18-29 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: ఉన్న‌త విద్యార్హ‌త‌లు, మెరిట్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. స్మార్ట్‌ మొబైల్ ఫోన్ వాడ‌కం, వివిధ యాప్స్(ఈ-బ్యాంకింగ్‌/ డిజిధ‌న్‌, సోష‌ల్ మీడియా త‌దిత‌రాలు) గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్య‌త ఉంటుంది‌. ఇంటర్వ్యూ సమయంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఫిబ్రవరి 05, 2021.
  • ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: ఫిబ్రవరి 20, 2021.
  • ఫ‌లితాల వెల్ల‌డి: మార్చి 15, 2021.
  • జాయినింగ్ తేది: ఏప్రిల్‌ 01, 2021.
  • వెబ్‌సైట్‌:https;//nyks.nic.in/