ఇక, ఖరీఫ్‌లో తెగులు కారణంగా నష్టపోయిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి
అత్యధికంగా రూ.1,280 కోట్లు కేటాయించింది. బిహార్‌కు రూ.1,255.27 కోట్ల
ఇవ్వనుంది. ఈ ఏడాది నివర్, బురేవి తుపానుల బారినపడ్డ తమిళనాడుకు రూ. 63.14
కోట్లు (నివర్), రూ. 223.77 కోట్లు (బురేవి) కేటాయించింది. కేంద్రపాలిత
ప్రాంతం పుదుచ్చేరికి రూ. 9.91 కోట్లు ఇచ్చేందుకు ఆమోదించింది. కాగా, వరదల
కారణంగా పంట మొత్తం ఊడ్చిపెట్టుకుపోయిన ఏపీ, తమిళ రైతుల కోసం కేవలం రూ.
577.58 కోట్లు కేటాయించిన మోదీ సర్కార్.. తెగులు సోకి నష్టపోయిన
మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు మాత్రం రూ. 2,535.27 కోట్లు కేటాయించడం
గమనార్హం. అంటే ఈ 2 రాష్ట్రాలకు ఇచ్చిన సాయంలో 3 దక్షిణాది రాష్ట్రాలకు
నాలుగో వంతు కూడా ఇవ్వలేదు.
జగన్ సర్కారుకు కేంద్రం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌కు కష్టకాలంలో మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. వరదల కారణంగా
నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రూ.280.76 కోట్ల సహాయం అందించాలని
నిర్ణయించింది. కానీ, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే అంత్యంత తక్కువ
పరిహారం దక్కింది. మధ్యప్రదేశ్, బిహార్‌కు ఒక్కో రాష్ట్రానికి రూ. వెయ్యి
కోట్లకు పైగా సహాయం ప్రకటించగా.. ఆంధ్రా, తమిళనాడు, పుదుచ్చేరి మూడు
రాష్ట్రాలకు కలిపి కేవలం రూ. 577.58 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సీ) 5 రాష్ట్రాలకు జాతీయ
విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయం
అందించేందుకు ఆమోదం తెలిపింది. 2020లో వరదలు, తుఫాన్, పంటల తెగులు దాడి
వల్ల ప్రభావితమైన రాష్ట్రాలకు నిధుల విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం
తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత
ప్రాంతానికి జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎంఎఫ్) నుంచి
రూ. 3,113.05 కోట్ల అదనపు సహాయాన్ని అందించనున్నట్లు శనివారం ఓ ప్రకటనలో
కేంద్రం తెలిపింది. ఇందుకు హెచ్‌ఎల్‌సీ ఆమోదించినట్లు పేర్కొంది. నైరుతి
రుతుపవనాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రూ. 280.76 కోట్లు ఇచ్చేందుకు
ఆమోదం తెలిపింది.