ఇండియ‌న్ ఆర్మీ 90 పోస్టుల ద‌ర‌ఖాస్తులు..

 ఇండియ‌న్ ఆర్మీ.. 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్-45వ‌ కోర్సుకు అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌లో ఆఫీస‌ర్లుగా నియ‌మిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 2 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https;//joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ఖాళీలు: 90

  • కోర్సు ప్రారంభం: జులై 2021 నుంచి కోర్సు ప్రారంభం అవు‌తోంది.
  • అర్హ‌త‌: క‌నీసం 70శాతం మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిసరిగా ఉండాలి.
  • వ‌య‌సు: 16 1/2 నుంచి 19 1/2 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. 02 జ‌న‌వ‌రి 2002 - 01 జ‌న‌వ‌రి 2005 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
  • ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ: మే 2021 నుంచి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఫిబ్రవరి 01, 2021.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: మార్చి 02, 2021.
  • వెబ్‌సైట్‌:https;//joinindianarmy.nic.in/