FCI లో 89 పోస్టులు..జీతం ₹50,వేల నుంచి..

 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 89 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు సంబందించి మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 31 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https;//fci.gov.in/ లేదా https;//www.recruitmentfic.in/  వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు- 89

  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)- 30
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 27
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్)- 22
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)- 8
  • మెడికల్ ఆఫీసర్- 2
ముఖ్య సమాచారం:
  • విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం: ఈ పోస్టులను ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • వేతనం: రూ.50,000 నుంచి రూ.1,80,000
  • దరఖాస్తులు ప్రారంభం: మార్చి 1, 2021
  • దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2021
  • వెబ్‌సైట్‌:https;//fci.gov.in/