పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 111 పోస్టులు ..

 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB).. 111 ప్యూన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులు బెంగళూరు వెస్ట్, బెంగళూరు ఈస్ట్, సూరత్, హర్యానా, బాలాసోర్, చెన్నై సౌత్ సర్కిల్స్‌లో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చివరి తేదీలు సర్కిళ్లవారీగా వేర్వేరుగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https;//www.pnbindia.in/  వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 111

  • చెన్నై సౌత్ సర్కిల్- 20
  • బాలాసోర్ సర్కిల్- 19
  • బెంగళూరు వెస్ట్ సర్కిల్- 18
  • బెంగళూరు ఈస్ట్ సర్కిల్- 25
  • సూరత్ సర్కిల్- 10
  • హర్యానా సర్కిల్- 19
సర్కిళ్ల వారీగా చివరితేదీలు ఇవే:
  • చెన్నై సౌత్ సర్కిల్: ఫిబ్రవరి 22, 2021
  • హర్యానా సర్కిల్: ఫిబ్రవరి 22, 2021
  • బాలాసోర్ సర్కిల్: మార్చి 1, 2021
  • సూరత్ సర్కిల్: మార్చి 1, 2021
  • బెంగళూరు ఈస్ట్ సర్కిల్: మార్చి 1, 2021
  • బెంగళూరు వెస్ట్ సర్కిల్: మార్చి 27, 2021
ముఖ్య సమాచారం:
  • విద్యార్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై.. ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసుండాలి.
  • వయస్సు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
  • దరఖాస్తు విధానం: పోస్టు ద్వారా అప్లయ్‌ చేయాలి. దగ్గర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో దరఖాస్తు ఫామ్ తీసుకొని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌కు పంపాలి. 10వ తరగతి, 12వ తరగతి మార్క్స్‌షీట్ జిరాక్స్ కాపీ, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, పర్మనెంట్ రెసిడెన్స్ ప్రూఫ్, కుల ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లాంటి పత్రాలు దరఖాస్తు ఫామ్‌కు జత చేసి పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్‌లు సర్కిళ్ల వారీగా నోటిఫికేషన్‌లో ఉంటాయి. అభ్యర్థులు సంబంధిత అడ్రస్‌లకు పంపాలి.
  • వెబ్‌సైట్‌:https;//www.pnbindia.in/